Donald Trump : కంపెనీలను మోసం చేసిన ట్రంప్..రూ.3వేల కోట్ల జరిమానా

Update: 2024-02-17 09:10 GMT

అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు (Donald Trump) షాకిచ్చిన న్యూస్ ఇది. ఆయనకు అమెరికా కోర్టు (America Court) భారీ జరిమానా విధించింది. కంపెనీలను మోసం చేసిన కేసులో సుమారు 355 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో రూ.3వేల కోట్ల జరిమానా చెల్లించాలని న్యూయార్క్ కోర్టు జడ్జి అంగోరాన్ ఆదేశించారు.

మూడేళ్లపాటు ట్రంప్ ఏ ఇతర చట్టపరమైన సంస్థలలో ఎలాంటి పదవిని నిర్వహించలేరంటూ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తన రిజిస్టర్డ్ కంపెనీల కోసం ఏ ఆర్థిక సంస్థ నుండి రుణం కోసం దరఖాస్తు చేయకూడదని కోర్టు తెలిపింది. న్యాయ ఉత్తర్వుల ప్రకారం జరిమానా మొత్తాన్ని ట్రంప్ చెల్లించాల్సిందే.

రుణదాతలను ట్రంప్ మోసం చేశారని.. అతని కంపెనీల ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపారని కోర్టు తన 90 పేజీల తీర్పులో తెలిపింది. కేసు విచారణ దాదాపు మూడు నెలల పాటు కొనసాగింది. 2017లో ట్రంప్ ఆర్గనైజేషన్ ను నిర్వహిస్తున్న ఆయన ఇద్దరు కుమారులకు కూడా శిక్ష పడింది. మోసం ద్వారా వ్యక్తిగత లాభాలు పొందారనే ఆరోపణలపై ట్రంప్ ఇద్దరు కుమారులపైనా గతంలో 4 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 34 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

Tags:    

Similar News