Donald Trump : ప్రమాణం చేసిన తొలిరోజు ట్రంప్ బిజీబిజీగా

Update: 2025-01-21 11:15 GMT

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తొలిరోజు ట్రంప్ బిజీబిజీగా గడిపారు. ఎక్కడా సమయాన్ని వృథా చేయకుండా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తొలిరోజున 42 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్/ మెమోరాండం/ ప్రకటనలు చేశారు. 115 మంది సిబ్బందిపై, 200 కంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 60 నిమిషాల పాటు ప్రెస్‌తో మాట్లాడారు. ఒక్కరోజులో 3 చారిత్రక ప్రసంగాలు ఇచ్చి తన మార్క్ చూపించారు.

అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా తమ దేశ సైన్యాన్ని తయారు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘చైనా అధీనంలోని పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఇకపై శత్రువులపై పోరాటమే అమెరికా దళాలకు ఏకైక లక్ష్యం. గల్ఫ్ ఆఫ్‌ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాం. ధరలు తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం’ అని ట్రంప్ తెలిపారు.

2025 అమెరికా ప్రజలకు స్వేచ్ఛాయుత సంవత్సరం అని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తాం. అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం. భిన్న సంస్కృతుల, సంప్రదాయాల కలయికే అమెరికా. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డా. అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తా. రాజ్యాంగబద్ధంగా, ప్రజస్వామ్యబద్ధంగా పని చేస్తాం’ అని ట్రంప్ అన్నారు

Tags:    

Similar News