Trump : ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Update: 2025-01-25 18:00 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు ఇక నుంచి ఆర్థిక సహాయం చేయొద్దని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, అభివృద్ధి, సెక్యూరిటీ, ఉద్యోగ శిక్షణ, ఎమర్జెన్సీ రిలీఫ్ కోసం అమెరికా ప్రతి ఏడాది 50 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అమెరికా ఖజానాకు ఈ నిధులు ఆదా కానున్నాయి. అయితే ఇజ్రాయిల్, ఈజిప్టుకు ఇచ్చే నిధులకు మినహాయింపునిచ్చారు.

అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారు. స్టూడెంట్ వీసా (F-1) ఉన్నవాళ్లు యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పార్ట్ టైమ్ చేయాలి. కానీ మనోళ్లు గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లలో జాబ్స్ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నవారిపై ట్రంప్ ఫోకస్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో దొరికితే వీసా క్యాన్సిల్ చేసి, స్వదేశాలకు పంపిస్తారని స్టూడెంట్ల భయం.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది

Tags:    

Similar News