Trump : అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

Update: 2025-03-21 06:15 GMT

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. అక్రమ వలసదారుల కోసం CBP హోమ్ యాప్ తీసుకొచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ యాప్‌ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశానికి వెళ్లవచ్చని తెలిపారు. అలా వెళ్లడం ద్వారా తరువాతి కాలంలో లీగల్‌గా అమెరికాకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా అక్రమంగా ఉండి ప్రభుత్వానికి పట్టుబడితే వారిని అమెరికా నుంచి బహిష్కరించడంతో పాటు దేశంలోకి మరోసారి ప్రవేశముండదని ట్రంప్ హెచ్చరించారు.

Tags:    

Similar News