పలు దేశాలపై ట్రంప్ టారిఫ్ లు విధించడాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ స్పందించారు. ఈ చర్యను సెల్ఫ్ గోల్ గా ఆయన అభివర్ణించారు. ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయని, భారత్పై విధించిన సుంకాల మూలంగా ప్రభావం స్వల్పమేనని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ సుంకాల ప్రభావం ముందుగా అమెరికా ఆర్ధిక వ్యవసపైనే తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఇది పూర్తిగా సెల్ఫ్ గోల్ వంటిందని చెప్పారు. సుంకాల మూలంగా వివిధ దేశాలపై ప్రభావం కంటే అమెరికాపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని చెప్పారు. భారత్పై సుంకాల మూలంగా అమెరికాలో భారత్ ఉత్పత్తుల ధరలు పెరిగి వినియోగం తగ్గుతుందని, ఇది భారత్ వృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. అమెరికాలో భారత్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుందని, ఇతర దేశాలతో పోల్చితే సుంకాలు భారత్పై తక్కువగా ఉన్నందున ఆ దేశాలపై పడే ప్రభావం కంటే మన దేశంపై తక్కువ ఉంటుందన్నారు.
అన్ని దేశాలపై సుంకాలు ఉన్నందున ఆయా దేశాల వస్తువుల రేట్లు కూడా అమెరికాలో పెరుగుతాయని, అందువల్ల భారత్ ఎగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లో మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయన్నారు రాజన్. అదే సమయంలో చైనా నుంచి కూడా మన దేశానికి దిగుమతులు పెరుగుతాయ న్నారు. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై ఇండియా టారిఫ్ లు తగ్గించడం ద్వారా అమెరికాతో మన ఎగుమతులపై వాటిని తగ్గించుకునేందుకు చర్చలు జరపవచ్చని చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలు అమెరికా మాదిరిగానే రక్షణాత్మక వ్యూహాలను అనుసరిస్తున్నాయని, ఇండియా ఈ విషయంలో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రఘురామ రాజన్ అభిప్రాయపడ్డారు.