TRUMP: ట్రంప్ సంచలన నిర్ణయం

19 దేశాల గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్లపై కఠిన పరిశీలన

Update: 2025-11-28 07:30 GMT

వైట్‌హౌస్ సమీపంలో ఆఫ్ఘ‌న్ వలసదారుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌తో పాటు మొత్తం 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్లపై కఠిన పరిశీలనకు ఆదేశించారు. ఇప్పటికే ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి వలస దరఖాస్తులను నిలిపివేసిన ట్రంప్.. మరో 18 దేశాల వారి గ్రీన్ కార్డులను క్షుణ్ణంగా పునఃపరిశీలించాలని ఆదేశించారు. ఈ 18 దేశాల జాబితాలో భారత్ లేదు.

'వైట్‌హౌస్‌ వద్ద ఉగ్రకాల్పులు'

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ కాల్పులు ఉగ్రచర్యే అని ఆయన పేర్కొన్నారు. దీని వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ ఉన్నట్లు ఆయన ఆరోపించారు. కాల్పుల సమయంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఫ్గాన్‌ జాతీయుడని అధికారులు ధ్రువీకరించారు.

వెనిజులాపై అమెరికా యుద్ధం?

వెనిజులా భూభాగంలో అతిత్వరోనే సైనిక ఆపరేషన్లు చేపతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. ఏ క్షణంలోనైనా తమ దళాలు దాడి చేయొచ్చని పేర్కొన్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోపై ఇప్పటికే డ్రగ్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ కేసులు నమోదు చేసిన ఆమెరికా.. అతన్ని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. డ్రగ్ స్మగ్లింగ్‌ కట్టిడిపేరుతో ఇప్పటికే కరేబియన్‌ సముద్రంలో భారీగా బలగాలను మోహరించింది.

Tags:    

Similar News