అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ లతో భేటీ కానున్నారు యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రిషి సునక్. ఇందుకుగాను ఆదివారం అమెరికాలో పర్యటిస్తున్నారు రిషి. చైనా ను ఎదుర్కోవడానికి ఈ మూడు దేశాలు ( అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ( AUKUS )) ఏకమయ్యాయి. నివేధికల ప్రకారం చైనాను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన జలాంతర్గామి ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఖరారు చేయడంపై ఈ సమావేశం ఏర్పాటైనట్లు అధికారులు తెలిపారు.
"నేను AUKUS న్యూక్లియర్ సబ్ మెరైన్ ప్రోగ్రాం యొక్క తదుపరి దశను ప్రారంభించడానికి యునైటెడ్ స్టేట్స్ కు వెళ్తున్నాను. ఇది మా సన్నిహిత మిత్రదేశాలతో సంబంధాలను పటిష్టం చేస్తుంది. భద్రత, సాంకేతికత, ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది" అని రిషి సునక్ తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించినప్పటినుంచి చైనాతో ఉద్రిక్తలు పెరుగుతున్నయని యూకే అభిప్రాయపడింది. అణుశక్తితో నడిచే జలాంతర్గాములకు సాంకేతిక, సామర్థ్యాన్ని ఆస్ట్రేలియాకు అందించడానికి యూఎస్, యూకే అంగీకరించాయి.