UK Covid Cases : UKలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
UK Covid Cases : తాజాగా UKలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 129,471 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.;
UK Covid Cases : తాజాగా UKలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 129,471 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.. ఇదే అక్కడ ఇప్పటివరకు ఉన్న రికార్డు.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తినే కారణమని తెలుస్తోంది. తాజా కేసులతో కలిపి అక్కడ కరోనా కేసుల సంఖ్య 1,23,38,676కి చేరుకుంది. ఇక వైరస్ కారణంగా మరో 18 మంది మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య 1,48,021కి చేరింది. రాబోయే రోజుల్లో బ్రిటన్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది.