SILVER: వెండి ధర చరిత్రలో సరికొత్త రికార్డు

మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్‌కు చేరువలో వెండి...ఔన్సు వెండి ధర $62 దాటింది...ప్రపంచంలో 5వ అత్యధిక విలువైన ఆస్తిగా వెండి... ఏడాదిలో 115% పెరిగిన వెండి ధర

Update: 2025-12-14 11:30 GMT

అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర అనూహ్యంగా పెరగడంతో, ఈ లోహం అత్యంత విలువైన ఆస్తిగా నిలుస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా, వెండి మార్కెట్ విలువ ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దాదాపుగా చేరువైంది.

మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువను ఛేదిస్తూ...

శు­క్ర­వా­రం రో­జున అం­త­ర్జా­తీ­యం­గా ఔన్సు (31.10 గ్రా­ముల) వెం­డి ధర $62 (డా­ల­ర్ల­కు) చే­ర­డం­తో, వెం­డి మొ­త్తం మా­ర్కె­ట్ వి­లువ సు­మా­రు $3.491 ట్రి­లి­య­న్ల­కు ($3.491 లక్షల కో­ట్ల డా­ల­ర్ల­కు) చే­రిం­ద­ని కం­పె­నీ­స్‌­మా­ర్కె­ట్‌­క్యా­ప్‌.కా­మ్‌ వె­బ్‌­సై­ట్ తె­లి­పిం­ది. ఇప్ప­టి­వ­ర­కు వె­లి­కి తీ­సిన 17,51,000 మె­ట్రి­క్ టన్నుల వెం­డి ఆధా­రం­గా ఈ వి­లు­వ­ను అం­చ­నా వే­శా­రు. దీం­తో, ప్ర­పం­చం­లో­నే అత్య­ధిక మా­ర్కె­ట్ వి­లువ కలి­గిన ఆస్తు­ల­లో ఐదో స్థా­నా­న్ని వెం­డి దక్కిం­చు­కుం­ది. మై­క్రో­సా­ఫ్ట్ మా­ర్కె­ట్ వి­లువ ($3.556 లక్షల కో­ట్ల డా­ల­ర్ల సమీ­పా­ని­కి) వెం­డి వి­లువ చే­ర­డం దీని ప్రా­ము­ఖ్య­త­ను తె­లు­పు­తుం­ది. వెం­డి కంటే ఎక్కువ మా­ర్కె­ట్ వి­లువ గల కం­పె­నీ­లు ప్ర­స్తు­తం ప్ర­పం­చం­లో కే­వ­లం 4 మా­త్ర­మే ఉం­డ­టం వి­శే­షం. ఈ పె­రు­గు­ద­ల­కు ప్ర­ధాన కా­ర­ణా­లు ఇవే. వెం­డి ధర ఇం­త­లా పె­ర­గ­డా­ని­కి అనేక అం­త­ర్జా­తీయ అం­శా­లు దో­హ­ద­ప­డు­తు­న్నా­యి. అని­శ్చి­తి, ద్ర­వ్యో­ల్బ­ణం: రష్యా-ఉక్రె­యి­న్ యు­ద్ధం, ట్రం­ప్ పరి­పా­లన వి­ధా­నా­లు, సుం­కాల పెం­పు వంటి అం­శాల వల్ల నె­ల­కొ­న్న అం­త­ర్జా­తీయ అని­శ్చి­తి, ద్ర­వ్యో­ల్బ­ణం పె­ర­గ­డం వంటి పరి­ణా­మాల కా­ర­ణం­గా సు­ర­క్షి­త­మైన ఆస్తు­లు­గా భా­విం­చి మదు­ప­రు­లు బం­గా­రం, వెం­డి కొ­ను­గో­ళ్ల­కు మొ­గ్గు చూ­పా­రు.

పారిశ్రామిక డిమాండ్: ఆభరణాల రంగాన్ని మించి వెండికి పారిశ్రామిక గిరాకీ గణనీయంగా పెరిగింది. సెమీకండక్టర్లు, సౌర విద్యుత్తు (Solar Power), విద్యుత్తు వాహనాల (EV) విభాగాల నుంచి డిమాండ్ అధికమవడంతో ధర పెరుగుతోంది. వాస్తవానికి, వెండి మొత్తం డిమాండ్‌లో సగానికి పైగా పారిశ్రామిక రంగం నుంచే వస్తుంది. ఫె­డ్‌ వడ్డీ­రే­టు తగ్గిం­పు: ఇటీ­వల అమె­రి­కా కేం­ద్ర­బ్యాం­క్ ఫెడ్ వడ్డీ­రే­టు­ను 0.25% తగ్గిం­చ­డం­తో, బాం­డ్ల­పై ప్ర­తి­ఫ­లం తగ్గి, బం­గా­రం, వెం­డి­పై మదు­ప­రుల ఆస­క్తి మళ్లీ పె­రి­గిం­ది. డా­ల­ర్ బల­హీ­న­ప­డ­టం కూడా దీ­ని­కి తో­డైం­ది. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా వెం­డి ఉత్ప­త్తి కంటే, గి­రా­కీ ఎక్కు­వ­గా ఉం­డ­టం ఈ ధరల పె­రు­గు­ద­ల­కు మరో ము­ఖ్య కా­ర­ణం. గ్లో­బ­ల్ సి­ల్వ­ర్ ఇన్స్టి­ట్యూ­ట్ ని­వే­దిక ప్ర­కా­రం, వెం­డి మా­ర్కె­ట్ వరు­స­గా ఐదో సం­వ­త్స­ర­మూ లోటు తో కొ­న­సా­గు­తోం­ది. ధర పె­రు­గు­తు­న్నం­దున, మదు­ప­రు­లు వెం­డి ఈటీ­ఎ­ఫ్‌ (ఎక్స్‌­ఛేం­జ్ ట్రే­డె­డ్ ఫం­డ్‌)లలో పె­ట్టు­బ­డి పె­డు­తు­న్నా­రు. ఇది కూడా ధరలు మరింత అధి­కం కా­వ­డా­ని­కి కా­ర­ణ­మ­వు­తోం­ది. దే­శీ­యం­గా కిలో వెం­డి ధర: మన­దే­శం­లో కిలో వెం­డి ధర లోహ రూ­పం­లో గు­రు­వా­ర­మే ₹2 లక్ష­లు మిం­చిం­ది. శు­క్ర­వా­రం ఎం­సీ­ఎ­క్స్ ట్రే­డిం­గ్‌­లో­నూ ₹2 లక్ష­లు మిం­చి­నా, తర్వాత కా­స్త తగ్గిం­ది. హై­ద­రా­బా­ద్ బు­లి­య­న్ మా­ర్కె­ట్‌­లో గు­రు­వా­రం కిలో వెం­డి ధర ₹2,00,100 వద్ద ము­గి­య­గా, శు­క్ర­వా­రం రా­త్రి ₹7,000 తగ్గి ₹1,93,100కు పరి­మి­త­మైం­ది. ఈ ఏడా­ది జన­వ­రి నుం­చి ఇప్ప­టి వరకు వెం­డి ధర 115% పె­ర­గ­డం గమ­నా­ర్హం

Tags:    

Similar News