TARIFF: భారత్‌పై టారీఫ్‌లు అక్రమం

టారిఫ్‌లు వెంటనే ఎత్తేయాలి...అమెరికన్ కార్మికులు, వినియోగదారులకే  నష్టం...అమెరికా చట్టసభలో తీర్మానం

Update: 2025-12-14 12:30 GMT

అమె­రి­కా అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్ ట్రం­ప్ భా­ర­త­దే­శం­పై వి­ధిం­చిన 50 శాతం టా­రి­ఫ్‌­లు ఇప్పు­డు రా­జ­కీ­యం­గా, చట్ట­ప­రం­గా తీ­వ్ర వి­వా­దా­ని­కి ఆజ్యం పో­స్తు­న్నా­యి. ఈ టా­రి­ఫ్‌­ల­ను అక్ర­మ­మ­ని పే­ర్కొం­టూ అమె­రి­కా కాం­గ్రె­స్‌­లో­ని డె­మొ­క్రా­టి­క్ చట్ట­సభ సభ్యు­లు బల­మైన వి­మ­ర్శ­ల­కు ది­గా­రు. భా­ర­త­దే­శం-అమె­రి­కా మధ్య వా­ణి­జ్య, పె­ట్టు­బ­డి సం­బం­ధా­లు బలం­గా ఉన్న సమ­యం­లో ఈ సుం­కా­లు రెం­డు దే­శాల మధ్య సం­బం­ధా­ల­ను దె­బ్బ­తీ­శా­య­ని వారు అభి­ప్రా­య­ప­డ్డా­రు. కాం­గ్రె­స్ మహిళ  నేత డె­బో­రా రాస్ మా­ట్లా­డు­తూ.. వా­ణి­జ్యం, పె­ట్టు­బ­డు­లు, శక్తి­వం­త­మైన భా­ర­తీయ-అమె­రి­క­న్ సమా­జం ద్వా­రా నా­ర్త్ కరో­లి­నా రా­ష్ట్ర ఆర్థిక వ్య­వ­స్థ భా­ర­త­దే­శం­తో లో­తు­గా అను­సం­ధా­న­మై ఉం­ద­ని తె­లి­పా­రు. భా­ర­తీయ కం­పె­నీ­లు ఆ రా­ష్ట్రం­లో ఒక బి­లి­య­న్ డా­ల­ర్ల­కు పైగా పె­ట్టు­బ­డు­లు పె­ట్టా­య­ని, ము­ఖ్యం­గా లైఫ్ సై­న్సె­స్, టె­క్నా­ల­జీ రం­గా­ల్లో వే­లా­ది ఉద్యో­గా­ల­ను సృ­ష్టిం­చా­య­ని ఆమె హై­లై­ట్ చే­శా­రు.

అదే సమ­యం­లో.. నా­ర్త్ కరో­లి­నా తయా­రీ సం­స్థ­లు ఏటా వందల మి­లి­య­న్ల డా­ల­ర్ల వి­లు­వైన ఉత్ప­త్తు­ల­ను భా­ర­త­దే­శా­ని­కి ఎగు­మ­తి చే­స్తు­న్నా­య­ని పే­ర్కొ­న్నా­రు. ఈ నే­ప­థ్యం­లో ట్రం­ప్ వి­ధిం­చిన టా­రి­ఫ్‌­లు రా­ష్ట్ర ఆర్థిక ప్ర­యో­జ­నా­ల­కు కూడా నష్టం కలి­గి­స్తు­న్నా­య­ని ఆమె స్ప­ష్టం చే­శా­రు. ఇదే అం­శం­పై కాం­గ్రె­స్ సభ్యు­డు వీసీ స్పం­ది­స్తూ.. భా­ర­త­దే­శం అమె­రి­కా­కు ము­ఖ్య­మైన సాం­స్కృ­తిక, ఆర్థిక, వ్యూ­హా­త్మక భా­గ­స్వా­మి అని అన్నా­రు.ఇప్ప­టి­కే పె­రు­గు­తు­న్న జీవన వ్య­యా­ల­తో ఇబ్బం­ది పడు­తు­న్న సా­ధా­రణ అమె­రి­క­న్ల­పై ఈ టా­రి­ఫ్‌­లు అద­న­పు పన్ను­ల్లా మా­రా­య­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఈ అక్రమ సుం­కా­లు భా­ర­త­దే­శా­న్ని మా­త్ర­మే కా­కుం­డా అమె­రి­కా వి­ని­యో­గ­దా­రు­ల­ను కూడా నష్ట­ప­రు­స్తు­న్నా­య­ని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు.

భా­ర­తీయ-అమె­రి­క­న్ కాం­గ్రె­స్ సభ్యు­డు రాజా కృ­ష్ణ­మూ­ర్తి మరింత ఘా­టు­గా స్పం­ది­స్తూ.. భా­ర­త­దే­శం నుం­చి వచ్చే వస్తు­వుల ది­గు­మ­తు­ల­పై వి­ధిం­చిన ఈ సుం­కా­లు సర­ఫ­రా గొ­లు­సు­ల­కు అం­త­రా­యం కలి­గి­స్తు­న్నా­య­ని, అమె­రి­క­న్ కా­ర్మి­కు­ల­కు హాని చే­స్తు­న్నా­య­న్నా­య­న్నా­రు. ఈ సుం­కా­లు వి­ని­యో­గ­దా­రుల ఖర్చు­ల­ను పెం­చు­తు­న్నా­య­ని ఆయన హె­చ్చ­రిం­చా­రు. ఈ వి­ధ­మైన చర్య­లు అమె­రి­కా ప్ర­యో­జ­నా­ల­ను గానీ, భద్ర­త­ను గానీ ముం­దు­కు తీ­సు­కె­ళ్ల­వ­ని అన్నా­రు. ఈ సుం­కా­ల­ను ము­గి­స్తే అమె­రి­కా-భా­ర­త్ మధ్య ఆర్థిక, భద్ర­తా సహ­కా­రం మరింత బలో­పే­తం అవు­తుం­ద­ని కృ­ష్ణ­మూ­ర్తి గట్టి­గా నొ­క్కి చె­ప్పా­రు. ట్రం­ప్ పరి­పా­లన ఆగ­స్టు 27 నుం­చి భారత ది­గు­మ­తు­ల­పై సుం­కా­ల­ను 50 శా­తా­ని­కి పెం­చ­డ­మే కా­కుం­డా, రష్యా నుం­చి ముడి చము­రు కొ­ను­గో­ళ్ల­పై 25 శాతం అద­న­పు టా­రి­ఫ్‌­ల­ను కూడా వి­ధిం­చిం­ది. భా­ర­త­దే­శం రా­యి­తీ ధరకు రష్య­న్ చము­రు­ను కొ­ను­గో­లు చే­య­డ­మే ఈ చర్య­ల­కు కా­ర­ణ­మ­ని ట్రం­ప్ ఆరో­పిం­చా­రు. మా­స్కో­తో భారత వా­ణి­జ్య సం­బం­ధా­లు ఉక్రె­యి­న్ యు­ద్ధా­ని­కి పరో­క్షం­గా మద్ద­తు ఇస్తు­న్నా­య­న్న­ది ఆయన వాదన. అయి­తే ఈ ని­ర్ణ­యా­ల­తో న్యూ­ఢి­ల్లీ-వా­షిం­గ్ట­న్ మధ్య సం­బం­ధా­లు తీ­వ్రం­గా క్షీ­ణిం­చా­యి. దీ­ని­ని సరి­ది­ద్దేం­దు­కు డె­బో­రా రాస్, వీసీ, రాజా కృ­ష్ణ­మూ­ర్తి, రో ఖన్నా సహా 19 మంది డె­మొ­క్రా­టి­క్ కాం­గ్రె­స్ సభ్యు­లు ట్రం­ప్‌­కు లేఖ రాసి.. భా­ర­త­దే­శం­పై వి­ధిం­చిన టా­రి­ఫ్‌­ల­ను వె­న­క్కి తీ­సు­కో­వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. కాం­గ్రె­స్‌­కు ఉన్న రా­జ్యాం­గ­బ­ద్ధ­మైన వా­ణి­జ్య అధి­కా­రా­ల­ను తి­రి­గి పొం­ద­డ­మే ఈ ప్ర­య­త్న­మ­ని వారు తె­లి­పా­రు.

Tags:    

Similar News