యుక్రెయిన్ రాజధాని కీచ్ కు మద్దతుగా మిలటరీ కాంట్రాక్టర్లను పంపించేందుకు బైడెన్ సర్కారు సమాత్తమవుతోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడంపై విధించుకున్న అప్రకటిత నిషేధం ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.
ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడితే ఈ ఏడాదే అమల్లోకి రానుంది. పెంటగాన్లోని పలు అమెరికా కంపెనీలు ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా అక్కడ పని చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. దెబ్బతిన్న ఉక్రెయిన్ ఆయుధ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణను వేగవంతం చేసే అవకాశం ఈ నిర్ణయంతో లభిస్తుంది. ప్రభుత్వ నిధులతో పనిచేసే కాంట్రాక్టర్లను అక్కడకు పంపి ఆయుధాల మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. దీనికి ఈ ఏడాది చివర్లో అమెరికా ఎఫ్-16 కీప్కు చేరనుండటంతో వాటి నిర్వహణకు కూడా ఈ సిబ్బంది ఉపయోగపడనున్నారు.
తమ ఆయుధాలతో రష్యా భూభాగంపై కీవ్ దాడులు చేయవచ్చని మే నెలలో బైడెన్ సర్కారు అనుమతి ఇచ్చింది. ఉక్రెయిన్లు సరఫరా చేసిన ఆయుధాల మరమ్మతులు, నిర్వహణ పనులను అమెరికా స్వయంగా చేపట్టడం లేదు. ఆయా ఆయుధాలను నిర్వహణ పనుల కోసం పోలాండ్, రొమేనియా లేదా ఏదైనా నాటో సభ్య దేశానికి తరలిస్తున్నారు.