అధ్యక్షుడు ఎవరు.. గెలుపు నాదంటే నాదంటూ..
మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను ఇప్పటి వరకు 400 ఫలితాలు వెల్లడయ్యాయి.;
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలుత డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉండగా, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక్కడ తొలుత ప్రకటించిన సర్వేల్లో మాత్రం బైడెన్ ఆధిక్యంలో ఉన్నట్లు చూపించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను ఇప్పటి వరకు 400 ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో బైడెన్‌కు 223 ఓట్లు పోలవగా, ట్రంప్‌కు 212 దక్కాయి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
స్తుతం అరిజోనా, న్యూహాంప్‌షైర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫ్లోరిడా, ఐయోవా, ఒహియోలో విజయం సాధించగా, నార్త్ కరోలినాలో విజయానికి ట్రంప్ దగ్గరలో ఉన్నారు. జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్‌లలో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఫలితాలు తనకు అనుకూలంగా ఉండనున్నాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ గెలుపు సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయం మనదే.. దీనిపై రాత్రికి ప్రకటన చేస్తా.. ప్రత్యర్థులు విజయాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డెమొక్రాట్ల కుట్రను భగ్నం చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బైడెన్ కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తామే గెలుస్తామని నమ్మకం ఉందంటున్నారు. ఎన్నికల్లో డెమొక్రాట్లు చాలా కష్టపడ్డారని అన్నారు. మెట్రో నగర ప్రజల ఓట్లు తమకే పడ్డాయని అన్నారు.. ఈ సందర్భంగా బైడెన్ అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.