California : నగరం కాలిపోతున్న వేళ.. రావణ కాష్టంలా లాస్ ఏంజెల్స్

Update: 2025-01-13 08:00 GMT

లాస్‌ఏంజెల్స్‌ ‌లో కార్చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తోంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది బ్రెంట్‌వుడ్‌ వైపు మళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోనే లిబ్రోన్‌ జేమ్స్‌, ఆర్నాల్డ్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ నివాసాలు ఉన్నాయి. హాలీవుడ్‌ తారలు నివసించే చోటుగా, ‘సిటీ ఆఫ్‌ ఏంజెల్స్‌’గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాస్‌ఏంజెల్స్‌ లో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా వుంది. లాస్‌ఏంజెలెస్‌ ప్రాంతంలో మొదలైన ‘ప్యాలిసేడ్స్‌ వైల్డ్‌ఫైర్‌’ పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఆ మంటలను ఆర్పడానికి ఫైర్‌ సిబ్బంది శక్తికి మించి శ్రమిస్తున్నారు. అయితే నీటి కొరత కారణంగా ఫైర్‌ హైడ్రంట్స్‌ పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రావట్లేదు. దీంతో ఈ ముప్పు నుంచి తమ ఇళ్లను కాపాడుకోవడానికి.. హాలీవుడ్‌ ప్రముఖులు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెడుతున్నారు. అపర కుబేరులు ప్రైవేటు ఫైర్‌ఫైటర్లకు గంటకు రూ.1.72లక్షలు.. అంటే రోజుకు దాదాపు రూ.40లక్షలు కూడా చెల్లించడానికి సిద్ధం అవుతున్నారు.

Tags:    

Similar News