WHO Chief: బాంబు దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు..

టెడ్రోస్‌ అధానోమ్‌కు కొద్దీ దూరంలోనే జరిగిన వైమానిక బాంబులో ఇద్దరు మృతి..;

Update: 2024-12-27 05:30 GMT

ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్‌లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్‌ అధానోమ్‌ వెళ్లాడు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ యెమెన్‌లో గల సనాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించాగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి, మాకు కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉందని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్‌ పేర్కొన్నాడు. దీంతో ఈ దాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది.

ఇక, ఈ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తీవ్రంగా ఖండించారు. యెమెన్‌- ఇజ్రాయెల్‌ల మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయని పేర్కొన్నారు. యెమెన్‌లోని పవర్ స్టేషన్‌లతో పాటు సనాలోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, ఎర్ర సముద్రం, ఓడరేవులపై వైమానిక దాడులు కొనసాగుతుండటం ఆందోళనకరంగా మారిందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క దేశం అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని సూచించారు. పౌరులు, మానవతా కార్మికులే లక్ష్యంగా కాల్పులు చేయకూడదని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News