Who is Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్ ఎవరో తెలుసా?

Who is Rishi Sunak : బ్రిటీష్ గడ్డని ఒక భారతీయుడు ఏలనున్నాడు. ఆయనే రిషి సునక్.

Update: 2022-07-07 12:45 GMT

Who is Rishi Sunak : బ్రిటీషర్లు భారతదేశాన్ని వందల సంవత్సరాలు ఏలారు. రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటీషర్లది అని చెప్పుకొంటారు. ఇప్పుడు అదే బ్రిటీష్ గడ్డని ఒక భారతీయుడు ఏలనున్నాడు. ఆయనే రిషి సునక్. బ్రిటెన్ ప్రధాని రాజీనామా చేయగానే తెరపైకి వచ్చిన పేరు..వ్యక్తి రిషి సునక్. బ్రిటెన్ ప్రభుత్వంలో రిజైన్ చేసిన 57 మంత్రులలో రిషి సునక్ ఒకరు. 2020 నుంచి ఆయన బ్రిటెన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలను చేపడుతూ వచ్చారు. బోరిస్ జాన్సన్ క్యాబినెట్ లో చాన్స్‌లర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ (ఆర్థిక శాఖ) గా వ్యవహరించారు.


రిషి సునక్ చాన్స్‌లర్‌గా పదవి చేపట్టగానే ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకొన్నారు. కోవిడ్ సంక్షోభంలో బిలియన్ పౌండ్లను ఖర్చు చేసి.. అటు కార్మికులతో పాటు వ్యాపారస్తులను ఆదుకొన్నారు. యంగ్ అండ్ డైనమిక్ మంత్రిగా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు.


మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడే ఈ రిషి సునక్. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని ఆయన వివాహమాడారు. వీరికి ఇద్దరు కూతుళ్లు క్రిష్ణ, అనౌష్క. 2015లో రిషి సునక్ బ్రిటెన్ రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. యోర్కషైర్ రిచ్‌మండ్ నుంచి ఆయన పార్లమెంట్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. క్రమంగా కంసర్వేటివ్ పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. లీవ్ యురొపియన్ యూనియన్ కాంపెయినింగ్‌లో బోరిస్ జాన్స్‌న్‌కు మద్దతుగా నిలిచారు రిషి సునక్.


2020 ఫిబ్రవరీలో ప్రధాని బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఎన్నికయి చరిత్ర సృష్టించారు. అక్టోబర్‌లో బ్రిటెన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి చరిత్రను తిరగరాయబోతున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News