World War III : యుద్ధంలోకి ఆ దేశాలు ఎంట్రీ ఇస్తాయా..?

Update: 2026-03-17 05:21 GMT

పశ్చిమాసియా యుద్ధం మూడోవారంలోకి చేరింది. యుద్ధం మొదట్లోనే ఖమేనీని లేపేస్తే యుద్ధం ఆగిపోతుందని అమెరికా అనుకుంది. కానీ అదంతా ఈజీ కాదని తేలిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కు ధీటుగా ఇరాన్ బదులిస్తోంది. వాస్తవానికి అమెరికా, ఇజ్రాయెల్ ను ఎదుర్కునే సైనిక, ఆయుధ శక్తి ఇరాన్ వద్ద లేదు. కానీ అమెరికా ఇన్ని రోజులు పోరాడుతున్నా ఇరాన్ ను లొంగదీసుకోలేకపోతోంది. దీన్ని బట్టి ఇక్కడ ఇరాన్ కు ఇతర దేశాల శక్తి అందుతోందనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. చైనా టెక్నాలజీతో తయారైన డ్రోన్లు, మిస్సైళ్లను ఇరాన్ వాడుతోందని ఇప్పటికే ట్రంప్ ఆరోపించారు. అటు ఉక్రెయిన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ కు కొన్ని లీకులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ వాడుతున్న డ్రోన్లు, టెక్నాలజీనే రష్యా కూడా వాడుతోందంట. వాటిని ఎలా డీగ్రేడ్ చేయాలో ఇప్పటికే ఉక్రెయిన్ కు తెలిసిపోయింది.

కాబట్టి అదే విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కు చెబుతోందంటే ఉక్రెయిన్. అంటే ఇన్ డైరెక్ట్ గా ఈ యుద్ధంలోకి రష్యా, చైనా కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పదివేల మిస్సైళ్లను జపాన్ వైపు పరిశీలించారు. దీన్ని బట్టి ఈ దేశాలు కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయా అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రష్యా, చైనా ఓపెన్ గా ఇరాన్ కు మద్దతు తెలిపాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసినా.. రష్యా, చైనాల నౌకలకు ఇరాన్ పర్మిషన్ ఇస్తోంది.

అయితే యూరప్ దేశాలు కూడా హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు దింపాలని ట్రంప్ కోరుతున్నారు. ఒకవేళ అదే జరిగితే యూరప్ కు వ్యతిరేకంగా ఉండే రష్యా కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇరాన్ కు సపోర్టుగా రష్యా, చైనా, ఉత్తర కొరియా దిగితే ఇక మూడో ప్రపంచ యుద్ధమే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. మరి అదే జరుగుతుందా లేదంటే ఏ దేశం అయినా వెనక్కు తగ్గుతుందా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News