ఓ మంచి పనికోసమంటూ.. నగర వీధుల్లో నగ్నంగా..

హౌస్‌మేట్ సరదాగా నగ్న బైక్ రైడ్ చేయాలని సూచించింది.

Update: 2020-12-02 09:02 GMT

బిజీగా ఉన్న రోడ్లు.. తనను పట్టించుకునే వారెవరు.. అందుకే అందరిలా ఆలోచించలేకపోయింది.. ఏదో ఒకటి చేసి జనం దృష్టిని తనవైపు మరల్చుకోవాలనుకుంది. అందుకే ఒంటి మీద నూలు పోగు లేకుండా నగర వీధుల్లో సైక్లింగ్ చేసింది.. తన ప్రయత్నం ఫలించి తన ఆశయం నెరవేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తోంది కెర్రీ బర్న్స్.

కెర్రీ బర్న్స్ మానసిక ఆరోగ్యం గురించి దిగ్భ్రాంతికరమైన వార్తలు విన్నది. తన కుటుంబం సభ్యుల్లోని ఒక బంధువు ఆత్మహత్యకు పాల్పడడం ఆమెలో విషాదం నింపింది. వారి కోసం తన వంతు సాయంగా ఏదో ఒకటి చేయాలనుకుంది. నగదు సేకరించడానికి ఏం చేయగలను అని ఆలోచిస్తున్నప్పుడు, ఆమె హౌస్‌మేట్ సరదాగా నగ్న బైక్ రైడ్ చేయాలని సూచించింది. కెర్రీ కూడా ఇది గొప్ప ఆలోచన అని అప్పుడే నిర్ణయించుకుంది.

కెర్రీ నవంబర్లో సవాలును స్వీకరించింది." ఆత్మహత్యల నివారణపై అవగాహన పెంచడంతో పాటు వారి కోసం కొంత డబ్బును సేకరించడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఊహించినట్లుగా, కెర్రీ స్నేహితులు, కుటుంబం ఈ ప్రణాళికను వ్యతిరేకించారు. కానీ తప్పుపడతారనుకున్న ప్రజలు ఆమె దేని కోసం అలా సైక్లింగ్ చేస్తుందో తెలుసుకుని సహాయకారిగా ఉన్నారు.

కెర్రీ తనతో కలిసి సైక్లింగ్ చేసేందుకు (దుస్తులు ధరించిన) స్నేహితుల సహాయాన్ని కోరింది. తన ప్రయత్నం ఫలించడంతో "ఇది చాలా సరదాగా ఉంది అని " కెర్రీ చెప్పారు. " ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. హైడ్ పార్క్ వద్ద రోలర్ స్కేటర్లు నాతోపాటు ప్రయాణించారు. ట్రఫాల్గర్ స్క్వేర్ వద్ద ప్రజలు నన్ను ఉత్సాహపరిచారు. కెర్రీ ఇప్పటివరకు 7 వేల పౌండ్ల (రూ.6,89,543) విరాళాలు సేకరించింది. ఇంకా వస్తాయని ఆశిస్తున్నాను'' అని ఆమె తెలిపింది. తాను సేకరించిన విరాళాలతో మానసిక సమస్యలతో బాధపడే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. 

Tags:    

Similar News