brain surgery: వయోలిన్‌ ప్లే చేస్తుండగా బ్రెయిన్ సర్జరీ... ఇప్పుడెలా ఉందంటే...

మూడేళ్ల తర్వాత కలుసుకున్న వైద్యుడు, సంగీత కళాకారిణి... ఆనాటి సంగతులు గుర్తు చేసుకుని భావోద్వేగం

Update: 2023-08-06 05:45 GMT

ప్రపంచవ్యాప్తంగా వైద్యశాస్త్రం నూతన దిశ వైపుగా పయనిస్తున్న సమయం అది. మూడేళ్ల క్రితం అదే సమయంలో ఓ మహిళకు అత్యంత అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. ఆ మహిళ వయోలిన్‌ ప్లే చేస్తుండగా ఆమెకు మెదడులోని ట్యూమర్‌‍ (violin during brain surgery)ను తొలగించారు. ఇప్పుడు ఆ మహిళ ఎలా ఉంది... ఆమె ప్రయాణం సాఫీగానే సాగుతోందా.. పదండి ఓసారి తెలుసుకుందాం..


మూడేళ్ల క్రితం బ్రిటన్‌లో రోగి వయోలిన్‌ ప్లే చేస్తుండగా వైద్యులు మెదడులో కణతిని తొలగించారు. అప్పటి వీడియోను శస్త్ర చికిత్సల గురించి తెలిపే హంటేరియన్‌ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనతో ఈ విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అప్పుడు వైద్యం చేసిన డాక్టర్‌ అష్కన్‌, సంగీత కళాకారిణి డాగ్మర్((Dagmar Turner ) అప్పటి పరిస్థితులను వివరించారు.


మూడేళ్ల క్రితం డాగ్మర్‌ అనే సంగీత కళాకారిణి మెదడులో వైద్యులు( brain surgery) కణతిని గుర్తించారు. కణతిని తొలగించకపోతే ప్రాణానికి ప్రమాదమని ఆమెకు వివరించారు. ఆపరేషన్‌కు సంసిద్ధత వ్యక్తం చేసిన డాగ్మర్ వైద్యులకు మాత్రం ఒక షరతును విధించారు. జీవితంలో సంగీతమే తనకు ముఖ్యమని చికిత్స తరువాత ఆ సామర్థ్యాలను కోల్పోకూడని తెలిపారు. ప్రముఖ న్యూరోసర్జన్‌ అష్కన్‌(Professor Keyoumars Ashkan) నేతృత్వంలోని వైద్య బృందం మెుదట డాగ్మర్‌ వయోలిన్‌ ప్లే చేస్తుండగా ఆమె మెదడును మ్యాప్‌ చేశారు. అంటే వయోలిన్‌ ప్లే చేస్తున్నప్పుడు మెదడులో చురుకుగా ఉంటున్న భాగాలను వారు గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స జరిగే సమయంలో మధ్యలో డాగ్మర్‌ను మేల్కొలిపి వయోలిన్‌ ప్లే చేయమని సర్జన్లు డాగ్మర్‌ను కోరారు. ఆమె చేయి కదలికలకు అనుగుణంగా మెదడులో కీలక భాగాలకు ఇబ్బంది లేకుండా వైద్యులు కణతిని తొలగించారు.


ఈ ఆపరేషన్‌ మెుత్తాన్ని లండన్‌లోని కింగ్స్ ఆస్పత్రి వర్గాలు వీడియో రికార్డింగ్ చేశాయి. ఆ వీడియోనే ప్రస్తుతం శస్త్ర చికిత్సల గురించి తెలిపే హంటేరియన్‌ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. శస్త్రచికిత్స తరువాత సంగీత విద్యను మర్చిపోతే తాను బతకలేనని డాగ్మర్‌ తెలిపారు. ఒకవేళ అందుకు వీలు కాకపోతే కణతితోనే జీవిస్తానని వైద్యులకు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. వయోలిన్ ప్లే చేస్తుండగా ఆపరేషన్‌ నిర్వహించడం ప్రత్యేకమైనదని డాక్టక్ అష్కన్ తెలిపారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది మెదడు పనితీరు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. సర్జరీ తరువాత కాళ్లు, చేతులను కదలించడం ఇబ్బందిగా ఉంటుందని వెల్లడించారు. కానీ ఆమె వయోలిన్‌ ప్లే చేయాలంటే చేతులను కదిలించాల్సి ఉంటుందని వివరించారు. సర్జరీ తరువాత చేతుల కదలికలకు ఇబ్బంది లేకుండా చేయడం సవాల్‌తో కూడుకున్నదని తెలిపారు.

Tags:    

Similar News