Indian-Origin Womens : కెనడా మంత్రులుగా భారత మూలాలున్న మహిళలు

Update: 2025-03-17 06:45 GMT

భారత మూలాలున్న ఇద్దరు మహిళల అనితా ఆనంద్, కమల్ ఖేరాకు కెనడా కొత్త క్యాబినేట్ లో చోటుదక్కింది. కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ వారిద్దరిని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలోనూ వీరిద్దరు మంత్రులుగా చేశారు. అయితే వారి కొత్త క్యాబినేట్ లో వారి శాఖలను మార్చారు. అనితా ఆనంద్ ఇన్నోవేష న్, సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా, కమల్ ఖేరా ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో జన్మించిన ఖేరా పాఠశాల విద్య చదువుతున్న రోజుల్లో ఆమె కుటుంబం కెనడాకు వెళ్లింది. ఆ తర్వాత అక్కడే ఆమె యార్కో యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. కెనడా పార్లమెంట్ కు ఎన్నికైన అతి చిన్న యవస్కు రాలు కూడా కమల్ ఖేరానే. 2015లో ఆమె బ్రాంప్టన్ వెస్ట్ నుంచి కెనడా పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అనితా ఆనంద్‌ 2019లో ఓక్‌విల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె తండ్రి తమిళనాడుకు, తల్లి పంజాబ్‌కు చెందిన డాక్టర్లు. జస్టిన్‌ ట్రూడో స్థానంలో అనితా ఆనంద్‌ ప్రధానమంత్రి అవుతారని ఒక దశలో ప్రచారం జరిగింది.

Tags:    

Similar News