Elon Musk: ఎలాన్ మస్క్‌కు 13వ బిడ్డ పుట్టాడా ?
ఎక్స్ అధినేతే నా బిడ్డకు తండ్రంటున్న రచయిత్రి!;
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై అమెరికన్ రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలు చేశారు. ఐదు నెలల క్రితం తాను జన్మనిచ్చిన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘ఐదు నెలల క్రితం నేను ఓ బిడ్డకు జన్మనిచ్చాను. నా బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి. మా బిడ్డ గోప్యత, భద్రత కోసం ఈ విషయాన్ని ఇంతకుముందు బయటపెట్టలేదు. నా బిడ్డ గోప్యతను మీడియా గౌరవించాలని కోరుతున్నా’ అంటూ క్లెయిర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ ప్రకటనపై ఎలాన్ మస్క్ స్పందించలేదు. కాగా, ఎలాన్ మస్క్ గత 20 ఏండ్ల కాలంలో 12 మంది సంతానానికి జన్మనిచ్చారు.
ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ఓ రచయిత షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు ఐదు నెలల క్రితం పుట్టిన బిడ్డకు మస్కే తండ్రి అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. నిజంగానే ఆ చిన్నారి మస్క్ బిడ్డేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే నిజం అయితే ఈ బిడ్డతో కలిపి మస్క్‌కు మొత్తం 13 మంది పిల్లలు అవుతారు.
రచయిత్రీ ఆష్లీ సెయింట్ క్లెయిర్ సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌యే తన బిడ్డకు తండ్రి అంటూ చెప్పుకొచ్చారు. ఐదు నెలల క్రితమే తనకు బిడ్డ పుట్టిందని.. ఆ చిన్నారికి తండ్రి ఎలాన్ మస్క్ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని.. కానీ కొన్ని మీడియా సంస్థ మాత్రం ఆ విషయాన్ని బయట పెట్టాలని ప్రయత్నించాయన్నారు. అందుకే తానే ఈ విషయాన్ని వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.అయితే తమ సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు.. తమ గోప్యతకు ఎవరూ భంగం కల్గించొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆష్లీ సెయింట్ క్లెయిర్ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. నిజంగానే ఈ చిన్నారి మస్క్ బిడ్డేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే నిజం అయితే మస్క్‌కు మొత్తం 13 మంది పిల్లలు అవుతారని చెప్పుకొస్తున్నారు.