భారత టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు కొన్ని దేశాలు వీసా లేకుండానే ప్రవేశించేలా సడలింపులు తీసుకొచ్చాయి. అందులో థాయ్‌లాండ్, మలేషియా, మారిషస్, జమైకా, మాల్దీవ్స్, కెన్యా, మకావు, బార్బడోస్, కజకిస్థాన్, గాంబియా, నేపాల్, ఎల్ సాల్వడార్, భూటాన్, హైతీ, సీషెల్స్, సెనెగల్, గ్రెనడా, అంగోలా, డొమినికా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్ & నెవిస్, మైక్రోనేషియా, ట్రినిడాడ్ & టబాగో ఉన్నాయి. భారతీయులు పైన పేర్కొన్న దేశాల్లో దాదాపు 60 రోజుల వరకు వీసా లేకుండానే ఉండవచ్చు. పర్యాటకాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగటానికి కొన్ని దేశాలు ఈ వీసా రహిత విధానం ప్రవేశపెట్టాయి. ఇది ఆ దేశాల ఆర్ధిక వ్యవస్థను బలపరచడానికి మాత్రమే కాకుండా.. పర్యాటకులు కూడా అనుకూలంగా ఉంటుంది.
టూర్లకు వెళ్లినప్పుడు ప్రయాణ ఖర్చుల కంటే అక్కడ ఉన్నన్ని రోజులు స్టే చేయడానికే ఎక్కువ ఖర్చు చేయాల్సివస్తుంది. దాంతో దూర ప్రాంతాలకు వెళ్తే అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలి అనే ఆలోచనతో లగ్జరీ స్టే కోరుకోవడం సహజం. అయితే, లగ్జరీ అంటే ఖర్చుతో కూడిన విషయం కాబట్టి అసలు ఇతరదేశాలకు వెళ్లడం మీద ఆసక్తి చూపేవాళ్లు కాదు. కానీ, దగ్గర్లో ఉండే దేశాలకు వెళ్లడం వల్ల ఇది కూడా ఒక బెనిఫిట్. కజకిస్తాన్ వంటి దేశాల్లో హోటల్లో స్టే చేయడానికి రెండు వేల నుంచి చార్జీలు మొదలవుతాయి. కాబట్టి ఖర్చు తగ్గే పని అంటే ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు మనవాళ్లు.