Ukrainian President: ఆస్కార్ వేదికపై ప్రసంగించే అవకాశాన్ని కోల్పోయిన జెలెన్‌స్కీ
Ukrainian President: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కీ ఆస్కార్ 2023 మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రసంగించే అవకాశాన్ని కోల్పోయారు.
Ukraine President: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కీ ఆస్కార్ 2023 మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రసంగించే అవకాశాన్ని కోల్పోయారు. ఆస్కార్ వేదికపై మాట్లాడాలని జెలెన్స్‌కీ చేసిన అభ్యర్థనను అకాడమీ తిరస్కరించింది. వరుసగా రెండవ సంవత్సరం, అకాడమీ జెలెన్‌స్కీ అభ్యర్ధనను తిప్పికొట్టింది. ఉక్రెయిన్‌కు సహాయం అందించడానికి అమెరికన్ల మద్దతు బలహీనపడిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రష్యా.. ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి, జెలెన్స్కీ అనేక అవార్డుల ప్రదర్శన కార్యక్రమాలలో కనిపించారు. జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని తన ప్రసంగ పాఠం సాగేది. ఏప్రిల్ 2022లో, జెలెన్స్కీ 64వ గ్రామీ అవార్డులలో జెలెన్‌స్కీ ప్రసంగిస్తూ తమపై దాడి చేస్తున్న రష్యాను తిప్పి కొట్టేందుకు ప్రపంచ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, జిమ్మీ కిమ్మెల్ 2018లో ఆస్కార్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ ఆమే హోస్ట్‌గా వ్యవహరిస్తారు. కిమ్మెల్ తర్వాత చాలా సంవత్సరాల పాటు షో హోస్ట్‌లెస్‌గా మారింది. గత సంవత్సరం, రెజీనా హాల్, అమీ షుమెర్ వాండా సైక్స్ ముగ్గురూ హోస్ట్ చేసారు.