AP : కథాగాన రూపంలో చంద్రబాబు జీవిత ప్రస్థానం

టీడీపీ అధినేత చంద్రబాబు జీవిత ప్రస్థానాన్ని కథాగానం రూపంలో తీసుకురావడంతో తన అదృష్టంగా భావిస్తున్నాని కేశినేని చిన్ని అన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు జీవిత ప్రస్థానాన్ని కథాగానం రూపంలో రిలీజ్ చేసిన చిన్ని... నారావారి పల్లి నుంచి నవ్యాంధ్రకు చంద్రబాబు జీవిత ప్రస్థానాన్ని కథాగానం రూపంలో పొందుపరిచామన్నారు.చంద్రబాబు జీవితం అందరికి ఆదర్శం అని వెనిగండ్ల రాము అన్నారు. చంద్రబాబు జీవిత చరిత్రను పాట రూపంలో తీసుకురావడం అద్భుతమని కొనియాడారు.
రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందన్నారు. ఇక జగన్ అవినీతి పనులతో రాజకీయాల్లో కొనసాగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు జీవిత ప్రస్థానాన్ని కథాగానం రూపంలో రిలీజ్ చేసిన కేశినేని చిన్నిపై ప్రశంసలు కురిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com