AP : మంత్రి జోగి రమేష్‌కు సొంత పార్టీ నేతల షాక్

గుంటూరులో మంత్రి జోగి రమేష్‌కు సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. మంత్రిపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు మండిపడ్డారు. సమీక్షా సమావేశానికి జోగి రమేష్ ఆలస్యంగా రావడంపై ఆసహనం వ్యక్తంచేశారు. ఉమ్మారెడ్డిని వేదికపైకి రావాలని జోగి రమేష్ ఆహ్వానించారు. అయితే వేదికపైకి రాను అంటూ ఖరాఖండిగా చెప్పేసి కిందే కూర్చున్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ముందుగానే ఆలస్యం అవుతుందని చెప్తే.. తాము కూడా అదే సమయానికి వచ్చేవాళ్లం కదా అని ఎమ్మెల్సీలు.. మంత్రి ముందే అసహనం వ్యక్తం చేసారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణ ప్రగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు రావాల్సి ఉండగా మంత్రి జోగి రమేష్ మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు వచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com