చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి
ఎర్రగొండపాలెంలో వైసీపీ శ్రేణులు రాళ్లురువ్విన ఘటనలో చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌ సంతోష్‌ తలకు గాయమైంది

ఎర్రగొండపాలెంలో వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్విన ఘటనలో చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌ సంతోష్‌ కుమార్‌ తలకు గాయమైంది.. ఈసాయంత్రం చంద్రబాబు కాన్వాయ్‌ ఎర్రగొండపాలెం చేరుకుంటున్న సమయంలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడికి తెగబడ్డాయి. దాడి సమయంలో ఎన్‌ఎస్‌జీ కమాండోస్‌ చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డారు. వైసీపీ కార్యకర్తల్ని చంద్రబాబు కాన్వాయ్‌ వరకు రానిచ్చారు సివిల్‌ పోలీసులు. దగ్గరకొచ్చిన తర్వాత రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. చంద్రబాబుపైకి రాళ్లు విసిరాయి. దీంతో రక్షణగా నిలబడ్డ ఎన్‌ఎజ్‌సీ కమాండోస్‌లో ఒక కమాండెంట్‌ తలకు గాయమైంది.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మూడు కుట్లు వేసి కట్టు కట్టారు వైద్యులు.

అటు వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిలో గాయపడిన ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌ సంతోష్‌ కుమార్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. సంతోష్‌ కుమార్‌కు అందిన ట్రీట్మెంట్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయాన్ని చంద్రబాబుకు చూపించారు కమాండెంట్‌ సంతోష్‌కుమార్‌.. ఇక వైసీపీ శ్రేణుల దుశ్చర్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మరోవైపు చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ రౌడీ మూకల దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అన్నారు.. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక అల్లర్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి సురేష్‌కు సీటు లేదని, జగన్‌ దగ్గర ప్రాపకం కోసమే దౌర్జన్యకాండకు దిగారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story