గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగుతుంది. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసిన చంద్రబాబు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తుండటంతో టీడీపీ నేతలు కూడా అప్రమత్తం అయ్యారు. వారికి అంతే స్ట్రాంగ్‌గా బదులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో పాటు రోడ్ షోలలో చంద్రబాబు పాల్గొంటారు. రేపు సాయంత్రం అమరావతిలో రోడ్ షో నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీటింగ్ లో ప్రస్తావించనున్నారు చంద్రబాబు. ఇక 26 వ తేదిన సత్తెనపల్లిలో, 27న తాడికొండలో చంద్రబాబు పర్యటిస్తారు. టీడీపీ అధినేత వస్తున్న నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల్లో వైసీపీ అరాచకాలను చంద్రబాబు దృష్టికి తీసుకురానున్నారు. మరోవైపు అధినేత పర్యటనతో కార్యకర్తలో జోష్ పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com