చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ భేటీపై నాదెండ్ల క్లారిటీ

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ భేటీపై నాదెండ్ల క్లారిటీ
X
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేసేందుకే చర్చలు జరిగాయని అన్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ భేటీపై ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేసేందుకే చర్చలు జరిగాయని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు, చర్చలు ఉంటాయని చెప్పారు. ఏపీ ప్రజల కోసమే పవన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. వైసీపీకి ప్రత్యామ్నాయం కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని స్పష్టంచేశారు. పదవులు, సీట్ల కోసం తమ పార్టీ అధినేత ఆరాట పడటం లేదన్న నాదెండ్ల మనోహర్.. ప్రజల ముందు మంచి ప్రత్యామ్నాయం ఉంచాలని అనుకుంటున్నారని తెలిపారు.

Tags

Next Story