ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

ఉభయగోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి ఏలూరు జిల్లా బాదంపూడికి చేరుకుంటారు. ఉంగుటూరు, నిడమర్రు, తాడేపల్లిగూడెం మండలాల్లో పర్యటిస్తారు. అకాల వర్షాలకు పాడైపోయిన పంటలను పరిశీలిస్తారు. దాదాపు రెండు గంటల పాటు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతుల కష్టనష్టాలను తెలుసుకుంటారు. 4 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో పర్యటిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కోనసీమ జిల్లా రామచంద్రపురం చేరుకుని రాత్రికి ఎన్‌వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో బస చేస్తారు.

రేపు వేగయమ్మపేటలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పొలాలను సందర్శించి రైతుల పరిస్థితిని తెలుసుకుంటారు. అనంతరం ...తూర్పుగోదావరి జిల్లా కడియం చేరుకుంటారు. కడియం ఆవ భూముల్లో పంట దెబ్బతిన్న రైతులతో మాట్లాడి నష్టపరిస్థితిని పరిశీలిస్తారు. అనంతరం 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు చేరుకుని సెంట్రల్‌ జైలులో ఉన్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, ఆమె మామగారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులను ములాఖత్‌ ద్వారా కలుసుకుంటారు. అనంతరం ...తిలక్‌రోడ్‌లోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇంటికెళ్లి ఆమెను పరామర్శిస్తారు. రోడ్డుమార్గాన రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడనుంచి హైదరాబాద్్కు బయలుదేరుతారు.

అకాల వర్షాలతో ఇప్పటికే దాదాపు 25 వేలకు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం దెబ్బతింది. వందలాది మంది రైతులు నష్టాల పాలయ్యారు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు గాని పరామర్శించిన పాపాన పోలేదు. జిల్లా స్థాయి అధికారులు ఆ వైపు చూడనే చూడలేదు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉమ్మడి పశ్చిమలో రైతులు విలవిలలాడిపోయారు. ఇలాంటి సమయంలో... రైతులకు అండగా ఉండనున్నారు చంద్రబాబు. తడిసి ముద్దైన వరి పొలాలను సందర్శిస్తారు. రైతులతో నేరుగా భేటీ అవుతారు.

Tags

Read MoreRead Less
Next Story