బాబు పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్

ఏపీ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పోరు బాట యాత్ర చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలవనున్నారు. దీంతో చంద్రబాబుకు తడిసిన ధాన్యం చూపించేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే.. తడిచిన ధాన్యాన్ని చంద్రబాబుకు చూపించకుండా.. రైతుల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎక్కడినుంచి తెచ్చి ఇక్కడ ధాన్యాన్ని ఎలా వేస్తారంటూ రైతులపై మండిపడ్డారు పోలీసులు. అంతేకాదు స్వయంగా పోలీసులే కూలీలుగా మారి... ధాన్యాన్ని ట్రాక్టర్ పైకి ఎత్తారు.
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సమరభేరి మోగించారు. రైతుల కష్టాన్ని పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న జగన్ సర్కారులో కదలిక తెచ్చేందుకు రైతు పోరుబాట చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో రైతులతో కలిసి రైతు పోరుబాట పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. . సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ముగుస్తుంది. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నారు. టీడీపీ అధినేత పాదయాత్ర కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఇరగవరం గ్రామం, రహదారులు.. టీడీపీ శ్రేణులు, జెండాలతో పసుపుమయంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com