జగన్‌ చేతిలో అందరూ బాధితులే: లోకేష్

జగన్‌ చేతిలో అందరూ బాధితులే: లోకేష్

జగన్‌ ప్రభుత్వం చేతిలో అందరూ బాధితులేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా మైదుకూరు నియోజకవర్గం పరిధిలో తటస్థ ప్రముఖలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ పాలనలో ఏ వర్గానికి రక్షణ లేదన్నారు. డాక్టర్లు, న్యాయవాదులు, చిరు వ్యాపారులపై కక్ష గట్టారని లోకేష్‌ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు దోపిడీలకు తెరలేపారని ఆరోపించారు. టీడీపీ హయాంలో కోర్ట్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే.. జగన్‌ ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో.. ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్‌ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story