Nara Lokesh : ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అంగీకరించబోం-లోకేష్

విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి నిర్వహించేలా చూస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. శంఖారావం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న లోకేశ్ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజక్ట్‌లన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని స్పష్టం చేశారు.
రెండు నెలల్లో వైకాపా ప్రభుత్వం కూలిపోయి తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలే కాదని... దిల్లీలో ఆయన పార్టీ ఎంపీలు కూడా జగన్‌ను నమ్మే స్థితిలో లేరని లోకేశ్ ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిన జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రాసిచ్చారని.... వారు ఊళ్లమీదపడి దోచుకున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వైకాపాకు ఆ దమ్ము, ధైర్యం ఉందా అని లోకేశ్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్విశాఖ ఉక్కును కాపాడుకుంటామని అభయమిచ్చారు.
తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేశ్ కార్యకర్తలను కోరారు. ప్రజలతో ఎంత మమేకమైతే అంత పెద్ద పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారని మండిపడ్డారు. పన్నుల భారం మోపుతూ ప్రజల రక్తం తాగుతున్న సీఎం రెండు నెలల్లో ఇంటికి పోవడం ఖాయమన్నారు. ఉత్తరాంధ్రను బాగుచేస్తానని జగన్ కబుర్లు చెప్పారని చివరకు ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం ఆలస్యమైతే నెలకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిన జగన్‌కు బుద్ధి చెప్పాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com