AP 10th Public Exams : నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్

నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్ష ఉంటుంది. ఉ.8.45 గం. నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. 6.49 లక్షల మంది విద్యార్థుల కోసం 3,450 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28తో ముగియనున్నాయి. మొత్తం 30,334 మంది కోసం 471 సెంటర్లను ఏర్పాటు చేశారు.
పబ్లిక్ పరీక్షల వేళ విద్యార్థులు టెన్షన్ పడొద్దని హోంమంత్రి అనిత సూచించారు. ‘జీవితంలో పదోతరగతి పరీక్షలు కీలకమే. కానీ అవే జీవితం కాదు. ఏడాదిపాటు నిద్రపోకుండా చదివిన మీ కష్టాన్ని ప్రతిబింబించేలా ప్రతి ప్రశ్నకు నైపుణ్యంతో జవాబు రాయండి. కేంద్రానికి ముందుగానే వెళ్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు బాగా రాయండి. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com