12న తణుకులో బాబు పర్యటన

12న తణుకులో బాబు పర్యటన
ఈనెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు

ఈనెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. రైతు పోరుబాట పాదయాత్ర పేరుతో తణుకు నియోజకవర్గంలో పర్యటించన్నారు. ఈ పాదయాత్ర ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు జరగనుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. ఇందుకోసం 11వ తేదీ రాత్రికి ఇరగవరం చేరుకోనున్నారు. 12వ తేదీ ఉ.9 నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. దాదాపు 14 కి.మీ మేర చంద్రబాబు పాదయాత్ర చేస్తారు. అనంతరం... తణుకులో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ పాదయాత్రలో టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story