Ap corna cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

X
AP Corona Cases
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత 24గంటల్లో కొత్తగా 1వెయ్యి 747 కేసులు నమోదయ్యాయి. 65వేల 920 సాంపిల్స్ పరీక్షించగా.. వెయ్యిపైగా పాజిటివ్ కేసులువచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కోవిడ్ తో 14మంది మృత్యువాత పడ్డారు. అదే విధంగా ఒక్కరోజులో 2వేల 365మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరులో అత్యధికంగా 293కేసులు నమోదుకాగా.. నెల్లూరులో 239, తూర్పుగోదావరి జిల్లాలో 234 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యంత తక్కువగా కర్నూలు జిల్లాలో కేవలం 9 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
