Konaseema District: కోనసీమలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

X
Konaseema District: కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రావులపాలెం మండలం కొమర్రాజులంకకు చెందిన నాగేశ్వరరావు.. మరో మహిళతో కలిసి కొత్తపేటలో ఉంటున్నాడు. ఇంటికి రాకపోవడంతో నాగేశ్వరరావు తల్లి సత్యవతి, భార్య వెంకటలక్ష్మి, కొడుకు మహేష్ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొత్తపేటకు వెళ్లి అతనితో ఘర్షణ పడ్డారు. తర్వాత అక్కడి నుంచి ముగ్గురు బైక్‌పై కొమర్రాజు లంకకు తిరిగివస్తుండగా.. మందపల్లి దగ్గర పాలవ్యాన్ బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వీరి డెడ్‌బాడీలను కొత్తపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
