టీడీపీలో చేరిన 300 మంది వైసీపీ కార్యకర్తలు

టీడీపీలో చేరిన 300 మంది వైసీపీ కార్యకర్తలు
పంచాయతీ ఎన్నికల వేళ విజయనగరంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి.

పంచాయతీ ఎన్నికల వేళ విజయనగరంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి. తెర్లం మండలం నందబలగ గ్రామానికి చెందిన 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బేబీ నాయన ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అత్యధిక పంచాయతీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని బేబీ నాయన ధీమా వ్యక్తం చేశారు.

Tags

Next Story