Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో 481 రైళ్ల రద్దు.. సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా 481 రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. మరో 152 రైళ్లను దారి మళ్లించామని, 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ, విజయవాడ-డోర్నకల్, డోర్నకల్-కాజీపేట, సికింద్రాబాద్-సిర్‌పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-షాలిమర్ తదితర రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసలపల్లి మార్గంలో ధ్వంసమైన రైల్వేట్రాక్ రిపేర్ పనులు వేగంగా జరుగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.రైల్వేట్రాక్ రిపేర్ పనులకు వరద ప్రవాహం ఆటకంగా మారిందని, అయినా దాదాపు 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. రిపేర్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ పర్యవేక్షించారు.మంగళవారం ఉదయం వరకు రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com