ఏపీలో కొత్తగా 997 కొవిడ్‌ కేసులు.. !

ఏపీలో కొత్తగా 997 కొవిడ్‌ కేసులు.. !
ఏపీలో కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 997 కేసులు నమోదయ్యాయి. 31వేల 325 మంది నుంచి సాంపిల్స్ తీసి టెస్టు చేశారు.

ఏపీలో కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 997 కేసులు నమోదయ్యాయి. 31వేల 325 మంది నుంచి సాంపిల్స్ తీసి టెస్టు చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,99,812కి చేరింది. కోవిడ్ వైరస్‌తో రాష్ట్రంలో మొత్తం ఐదుగురు మరణించారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖలలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 285మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story