Andhra Pradesh : యువతిపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. ఏపీలో దారుణం

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పుడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. 60 ఏళ్ల వృద్ధుడు ఏడాదిగా ఓ యువతిని బెదిరిస్తూ.. అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో చోటుచేసుకుంది. చెందిన 22 ఏళ్ల యువతి ఇంటి వద్దే ఉంటోంది. ఏడాది క్రితం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు యువతిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పలుసార్లు అలాగే బెదిరించి తన కామవాంఛ తీర్చుకున్నాడు.
ఈ నెల 13న యువతి తన తమ్ముడితో కలిసి వెళ్తుండగా వృద్ధుడు మళ్లీ బెదిరించాడు. ఆ తర్వాత యువతి మెడలో దారం వేసి ఫొటో దిగి పెళ్లయినట్లు చెప్పాడు. అతడి వేధింపులు తాళలేక యువతి తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబుతానని యువతి అంటే.. తన తండ్రి తాగే మందులో విషం కలిపి చంపుతానంటూ బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో తెలిపింది. వృద్ధుడిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com