Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తుడు మృతి.. క్యూలైన్‌లో ఉండగానే..

X
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శన క్యూలైన్‌లో ఓ వృద్ధ భక్తుడు మృతి చెందాడు. స్థానిక శంఖమిట్ట జనరేటర్ రూమ్ సమీపంలోని సర్వదర్శనం క్యూలైన్‌లో రద్దీ కారణంగా నిన్ని అర్ధరాత్రి స్వల్ప తోపులాట జరిగిగాయి. ఆ తోపులాటల్లో తమిళనాడు రాష్ట్రం కాంచీపురంకు చెందిన 64 సంవత్సరాల వేదాచలం స్పృహ కోల్పోయాడు. దీంతో రద్దీ క్యూలైన్లో ఉన్న అతడిని అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు.
అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా భక్తుడు కన్నుమూశాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే క్యూలైన్‌లో తోపులాటలు జరిగి భక్తుడు మరణించాడన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని విజిలెన్స్ అధికారులు అంటున్నారు. వేదాచలం గుండెపోటుతో కిందపడి చనిపోయాడని చెపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
