వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..!

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ బృందం...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ బృందం...పులివెందులకు చెందిన సునీల్‌కుమార్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు విషయాన్ని సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. గోవాలో సోమవారం సునీల్‌కుమార్ యాదవ్‌ను అరెస్టు చేసిన అనంతరం స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్‌ యాదవ్‌ను ట్రాన్సిట్‌ రిమాండ్‌లో కడప తీసుకొచ్చారు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌ కుమార్‌ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

వివేకానంద హత్య జరిగి రెంఢేళ్లయినా...నిందితులను పట్టుకోవటంలో తీవ్రజాప్యం జరుగుతోందని కుటుంబీకులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. వివేకా హత్యకేసుపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ..ముందు నుంచే సునీల్ యాదవ్‌ను కీలక అనుమానితుడిగా భావిస్తోంది. విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని...థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని సునీల్... గతంలో హైకోర్టును ఆశ్రయించాడు. అనంతరం పులివెందులలో తన నివాసానికి తాళం వేసి కుటుంబంతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సునీల్ గోవాలో ఉన్నట్లు గుర్తించిన సీబీఐ బృందం..అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

వివేకానంద హత్య కేసులో విచారణ వేగవంతం చేసిన సీబీఐ... కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో అనుమానితులను విచారిస్తున్నారు. అరెస్ట్‌ చేసిన సునీల్‌ యాదవ్‌తో పాటు వివేకా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌తో పాటు మరొకరిని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story