Krishna District: అర్థరాత్రి ఆకతాయి వేధింపులు.. ఒంటిచేతితో చితకబాదిన యువతి..

Krishna District: ఏపీలో మహిళలకు రక్షణ కరువైందా..?. వరుస అత్యాచారాలు, అఘాయిత్యాలు జనాన్ని కలవరపెడుతున్న తరుణంలో.. కృష్ణా జిల్లా గన్నవరంలో నడిరోడ్డుపై ఓ ఆకతాయి యువతిపై వేధింపులకు దిగాడు. రోజూలాగే విమానాశ్రమంలో పనులు ముగించుకుని రాత్రిపూట ఇంటికి వెళుతున్న యువతిని ఓ ప్రబుద్ధుడు బైక్‌పై వెంబడించాడు. బాధితురాలు వెళుతున్న బైక్‌ను అడ్డగించి వేధించడం మొదలుపెట్టాడు. అయితే అంతరాత్రి పూట ఒంటిరిగా ఉన్న బాధితురాలు.. అదరక, బెదరక.. ఆదిపరాశక్తిలా ఆ ఆకతాయిపై విరుచుకుపడింది.
కొంత దూరం నుంచి వెంబడిస్తూ వేధించడం గమనించిన యువతి.. ఇక తన స్కూటీని పక్కకు ఆపి ఆకతాయికి బడిత పూజ చేసింది. కర్రతో పోకిరీ ఒళ్లు వాయగొట్టింది. ఆడవాళ్లు ఎలా బతకాలిరా అంటూ నిలదీసింది. పదిమందిలోకి మేం ఎలా వెళ్లాలిరా అంటూ చెంపలు చెల్లుమనిపించింది. ఇక యువతి ధైర్య, సాహసాలు చూసిన వాళ్లంతా.. అమ్మాయిలంతా ఇదే ధైర్యంతో ముందుకెళ్లాలి అంటూ తనను ప్రశంసిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com