Rajahmundry: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా.. అయిదుగురు మృతి..

X
Rajahmundry: అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. మూలమలుపు వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఒరిస్సాలోని భవాని పట్నం నుంచి విజయవాడ వెళుతున్న సంగీత ట్రావెల్స్ బస్సులో 42 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని ఏడుగు రాళ్లపల్లి ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతో ప్రమాదం జరిగి ఉంటుందని ప్రయాణికులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చింతూరు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
