కరోనా వేళ పరీక్షలు.. నారా లోకేష్ కు తమ గోడును వివరించిన ఓ విద్యార్ధిని..!
ఇటు కరోనా విజృంభణ.. అటు పరీక్షలు జరపాల్సిందేనన్న ప్రభుత్వ పట్టుదల.. మధ్యలో విద్యార్థులు నలిగిపోతున్నారు.. తీవ్ర భయాందోళన చెందుతున్నారు.. కరోనా టైమ్‌లో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు విద్యార్థుల్లో కొత్త భయాన్ని కలిగిస్తున్నాయి.. పరీక్షలకు సిద్ధమైనప్పటికీ.. కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు..
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఓ విద్యార్ధిని తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. తాను కోవిడ్ బారిన పడ్డానని.. ఇలాంటి సమయంలో ఎగ్జామ్స్ ఎలా రాయగలనంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కల్పించుకోవాలని విజ్ఞప్తి చేసింది. పరీక్షలు వాయిదా వేస్తే.. మళ్లీ స్కూలుకు వెళ్లాల్సి ఉంటుందని.. మళ్లీ తనకు కరోనా వస్తే ఎవరి బాధ్యత అని నిలదీసింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు తమకు న్యాయం చేయాలని నారా లోకేష్ కు వాయిస్ మెజేస్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com