Chandrababu : చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

Chandrababu : చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు
డిసెంబర్ 7న ఢిల్లీకి చంద్రబాబు.. అనంతరం జల్లాల పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైలులో ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని ఏసీబీ కోర్టులో సీఐడీ వారెంట్లు దాఖలు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండగా ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది.

ఇవాళ సీఐడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున సీఐడీ వారెంట్లకు విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్టు తోసి పుచ్చింది. చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున విచారణ కుదరదని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చంద్రబాబు డిసెంబర్ 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల విషయంలో వైసీపీ నేతల అక్రమాలకు పాల్పడుతున్నారని సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. ఢిల్లీ పర్యటన పూర్తి పూర్తయ్యాక తిరిగి వచ్చి జిల్లాల్లో పర్యటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 11న శ్రీకాకుళం, 12న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న పలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టనున్నారు.

తుపాను.. సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

మిగ్జామ్ తుపాను నేపథ్యంలో పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక సూచన చేశారు. అందరూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొనాలని ఆదేశించారు. అత్యవసరమైన చోట నాయకులు, కార్యకర్తలు తమవంతు సాయం అందించాలని, ప్రజలకు నిత్యావసరాలు అందించాలని, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. తుపాను ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. కరెంటు లేక ప్రజలు చీకట్లోనే గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి.

Tags

Next Story