Ghat Road Accident : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. పలువురికి గాయాలు..

Ghat Road Accident : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. పలువురికి గాయాలు..
X

డ్రైవర్ నిర్లక్ష్యంతో తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న కారు ఘాట్ రోడ్డులోని ఏడో మైలు రాయి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం లో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ఘాట్ రోడ్డు లో డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ మధ్య ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.

ఈ సంఘటన నేపథ్యంలో.. ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తులకు పోలీసులు కొన్ని కీలక సూచనలు జారీ చేశారు. ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన మలుపుల వద్ద అప్రమత్తంగా, జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. అలాగే, ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేక్ చేయవద్దని హెచ్చరించారు. ఈ మార్గంలో డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వహించకుండా, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story