కల్తీలు.. నకిలీలు.. వైసీపీ తీరు ఇంతేనా..

ఏపీలో వైసీపీ తీరు అస్సలు మారట్లేదు. డెవలప్మెంట్ గురించి గానీ.. ప్రజల సంక్షేమం గురించి గానీ.. లేదంటే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడటం వైసిపికి చేతకాదు. ఎంతసేపు లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ఫేక్ ప్రచారం చేస్తుంటారు. ఇక వైసిపి హయాంలో కనిపించింది అంతా కల్తీనే. మరి ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లడ్డూలోనే కల్తీ చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి.. అత్యంత పవిత్రమైన లడ్డును కల్తీ చేసి పాపం చేశారు. సిట్ విచారణ లోను అత్యంత కీలక విషయాలు బయటపడుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ కల్తీకి బీజం పడింది. వైవి సుబ్బారెడ్డి పిఎ అప్పన్న పలు సంస్థలకు ఫోన్ చేసి కేజీకి 25 రూపాయలు చొప్పున లంచం అడిగాడంట. ఇదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి తోనే వీళ్ళు ఆటలు ఆడారంటే.. ఇక సామాన్య ప్రజల ప్రాణాలు అంటే వీళ్లకు లెక్క ఉంటుందా. అందుకే సామాన్య ప్రజల ప్రాణాలతో కల్తీ మద్యం పేరుతో చెలగాటమాడారు. మొలకల చెరువులో కల్తీ మద్యం కేంద్రం ఏర్పాటు చేసి అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ చేసిన అత్యంత దారుణమైన పని కల్తీ మద్యం. వందలాది మంది ప్రాణాలు తీసిన ఈ కల్తీ మద్యం దందాను జగన్ ఒక్కసారి కూడా అడ్డుకోలేదు. పైగా ఇప్పుడు నిజాలు బయటపడుతుంటే.. తన పార్టీ నేతలపై చర్యలు తీసుకోకపోగా.. వారిని వెనకేసుకొస్తున్నాడు. జగన్ హయాంలో ఇలా కల్తీలతో పాలనను గాలికి వదిలేసి జనాల ప్రాణాలతో.. హిందువుల నమ్మకంతో అరాచకాలు చేశారు.
ఆ అరాచకాలను భరించలేక ఏపీ ప్రజలు కూటమి పార్టీలకు పట్టం కట్టారు. కూటమి ఇమేజ్ నానాటికి పెరుగుతుంటే తట్టుకోలేని వైసిపి.. ఇప్పుడు నకిలీ పోస్టులకు.. నకిలీ ప్రచారానికి తెరతీసింది. గూగుల్ డేటా సెంటర్ నుంచి.. మెడికల్ కాలేజీల పిపిపి విధానం మీద కందుకూరు ఘటన మీద, దాని తర్వాత గుంటూరు మహిళ మరణం మీద, ఇప్పుడు మొంథా తుఫాన్ మీద.. ఇలా రకరకాల ప్రచారాలు చేసి.. అయితే పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి.. లేదంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి.. లేదంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి నకిలీ ప్రచారాన్ని ఎంచుకుంటుంది వైసిపి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

