NTR Trust : వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా ఐదో రోజు సహాయక కార్యక్రమాలు

NTR Trust : అకాల వర్షాల కారణంగా అన్ని కోల్పోయిన వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ అండగా నిలుస్తోంది. ట్రస్టు ఛైర్మన్ నారా భువనేశ్వరీ ఆదేశాలతో వరుసగా ఐదో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు ట్రస్టు ప్రతినిధులు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు ఆహారం, తాగు నీరు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ప్రతినిధులు. బాధితుల్లో భరోసా నింపుతున్నారు.
నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక కార్యక్రమాలు చేస్తోంది ఎన్టీఆర్ట్ ట్రస్టు. నెల్లూరు జిల్లాలోనూ వరుసగా ఐదో రోజు ఈ సహాయక కార్యక్రమాలు కొనసాగాయి. వరద బాధితులకు తాగునీరు, రొట్టేలు, పులిహోర, వెజిటెబుల్ రైస్ ప్యాకెట్లు అందించారు.
ఇక చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ ట్రస్టు సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. తిరుపతి రాయల చెరువు సమీపంలోని బాధితులకు 750కి పైగా ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. నక్కల కాలనీ జూపార్క్ దగ్గర బాధితులకు 250 ఫుడ్ ప్యాకెట్లు అందించారు.
ఆటోనగర్‌లో 200 మందికి రొట్టెలు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. శ్రీ కృష్ణా నగర్ లో 200 మందికి ఆహారం, తాగునీరు అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com