Ali Meet jagan : రెండు వారాల్లో ప్రకటన ఉంటుందని అనుకుంటున్నాను : అలీ

X
By - TV5 Digital Team |15 Feb 2022 4:52 PM IST
Ali Meet jagan : సీఎం జగన్‌ను కలిశారు సినీ నటుడు అలీ. ఏం ఆశించకుండానే తానూ వైసీపీలో చేరానన్నారు అలీ.
Ali Meet jagan : సీఎం జగన్‌ను కలిశారు సినీ నటుడు అలీ. ఏం ఆశించకుండానే తానూ వైసీపీలో చేరానన్నారు అలీ. వైఎస్సార్ సీఎం కాకముందు నుంచే వారి ఫ్యామిలీతో పరిచయం ఉందన్నారు. జగన్‌తో తనది పాతపరిచయమేనన్నారు. రెండు వారాల్లో పార్టీ ఆఫీసు నుంచి ప్రకటన ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసిన మాట వాస్తవమేనన్నారు. కానీ తనకు టైం లేకపోవడం వల్ల టికెట్ తీసుకోలేదన్నారు. సినిమా వాళ్లను పిలిచి అవమానించరనడంలో వాస్తవం లేదన్నారు. ఆ అవసరం సీఎం జగన్‌కు లేదన్నారు. సినీ సమస్యల పరిష్కారానికి జగన్ హామీ ఇచ్చారని, పరిష్కరిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. 1999లోనే తానూ రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com