Y.S.Sharmila : ఎల్లుండే పెళ్లి.. వైఎస్ షర్మిల కొడుకు వివాహానికి అంతా రెడీ

Y.S.Sharmila : ఎల్లుండే పెళ్లి.. వైఎస్ షర్మిల కొడుకు వివాహానికి అంతా రెడీ

షర్మిల కుటుంబంలో శుభకార్యానికి వేళయింది. కొడుకు పెళ్లి ఆహ్వానాలతో.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలతో ఈ మధ్యే లైమ్ లైట్ లోకి వచ్చింది వైఎస్ షర్మిల (Y.S.Sharmila). ఇటు పొలిటికల్ జర్నీ స్పీడును పెంచుతూనే... అటు ఇంట్లో పెళ్లి వేడుక పనులను కూడా అంతే వేగంగా పూర్తి చేయిస్తోంది.

ఏపీ కాంగ్రెస్‌ (AP Congress) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, అనిల్ కుమార్ దంపతుల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి, అట్లూరి ప్రియల పెళ్లి వేడుక ఫిబ్రవరి 17న జరగనుంది. రాజస్థాన్‌ జోధ్‌పుర్‌లోని ఉమైద్‌ భవన్‌లో అట్టహాసంగా పెళ్లి వేడుక నిర్వహించేదుకు అంతా సిద్ధమైంది.

పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన వేడుకలు 3 రోజుల పాటు ఈ నెల 16 నుంచి 18 వరకు జరనున్నాయని తెలుస్తోంది. కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా వైఎస్ షర్మిల బుధవారమే జోధ్‌పుర్‌ పట్టణానికి చేరుకున్నారు. హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి జరగనుంది. 16న సంగీత్‌, మెహందీ, 17న సాయంత్రం 5.30 గంటలకు వివాహం, 18న రిసెప్షన్ నిర్వహించనున్నారు.

Tags

Next Story